Posts

Showing posts from January, 2026

Amma Nee Padamu Song Lyrics | Devotional Songs | Ammavri Patalu

Image
  Experience the divine bliss with this soulful Ammavari devotional song, describing the supreme importance and grace of the Goddess's lotus feet (అమ్మవారి పాదాలు). This song brings peace and spiritual energy to your soul. Watch on YouTube Telugu Lyrics: అమ్మా నీ పాదము ఆనంద నిలయము  అది తెలిసిన వారిచే జన్మ ధన్యము || అమ్మా !! బ్రహ్మాదులు పూజించిన బ్రహ్మణ నీ పాదము  రమావాణి సేవించిన రమ్యమైన పాదము.  కైలాస గిరియందు కదలాడే పాదము  అలమేరు నిలయాన్ని అలరించే పాదము ||అమ్మా|| వేదన పొందిన జీవుల దరిచేర్చే పాదము  చీకటి బ్రతుకున వెలుగులు విరజిమ్మే పాదము  భవ బంధములను బాపే బంగారు పాదము.  అనురాగ పాశముతో బంధించే పాదము ||అమ్మా|| వేదశాస్త్ర పురాణాలు వివరించే పాదము  శివ తాండవ జతిగతులను నర్తించే పాదము. యోగింద్రుల జపతపముల ధ్యానమే నీ పాదము.  భక్త జనుల అర్చనలతో శోభిల్లే పాదము ||అమ్మా|| లోభిని త్యాగిని చేసే లోకమాత పాదము  మూఢుని జ్ఞానిగ మార్చే ముచ్చటైన పాదము  అజ్ఞాన తిమిరమును తొలగించే ...

Suryanarayana Chalisa Lyrics in Telugu & English | Surya Dev Powerful Prayer Benefits

Image
 Suryanarayana Chalisa is a powerful devotional hymn dedicated to Lord Surya (Sun God), the source of life and energy. Chanting or listening to Suryanarayana Chalisa daily is believed to bring good health, confidence, success, and positive energy. ✨ Benefits of Chanting Suryanarayana Chalisa Improves health, vitality, and immunity Helps in career growth and success Reduces mental stress and negativity Increases self-confidence and positivity Best chanted during early morning (Sunrise)                                                                   Watch on YouTube Telugu Lyrics: అదిగో అదిగో ఆదిత్యుడు  ఆ అదితి కన్న ప్రియ సుతుడు  సప్తాశ్వముల శోభితుడు కన్నుల వెలిగే ఘనవిభుడు నారాయణ సూర్యనారాయణ ఆదిత్య రూపా నారాయణ దినకర తేజ దివాకరా పరమ ప్రకాశ ప్రభాకరా నారాయణ సూర్యనారాయణ ఆదిత్య రూపా నారాయణ బ్రహ్మ తేజమున భాసించి సాక...

Ranganatha Swamy Bhajana Lyrics | Ranganayaka Songs | Devotional Song Lyrics

Image
  Ranganatha Swamy bhajans are widely sung during temple rituals, bhajans, poojas, Ekadasi, Vaikunta Ekadasi, and other devotional gatherings. These lyrics help devotees sing along and experience divine peace and devotion. This post is useful for devotees searching for authentic Telugu Ranganatha Swamy bhajan lyrics for   daily  prayers, bhajan sessions, and spiritual programs.        Watch on YouTube Telugu Lyrics: హరిలో రంగ హరి హరిలో రంగ హరి హరి నారాయణ హరి హరి హరిలో రంగ హరి హరిలో రంగ హరి హరి నారాయణ హరి హరి గోదా దేవి వలచిన స్వామి శ్రీ రంగ నాధా హరి హరి||2|| కొప్పుగ నీలను పెండ్లాడిన శ్రీరంగధాముడవు సరిసరి||2| ||హరిలో రంగ|| మకర సంక్రమణ పుణ్య కాలమున  శ్రీ హరి నామము సరి సరి||మకర|| భక్త జనులు గొంతెత్తి పాడిన మదిలో నిండెను మరిమరి|| భక్త||హరిలో రంగ|| గోకుల నందన గోపాలకృష్ణ గోవింద నామము హరిహరి||గోకుల|| పల్లెసీమ ను చల్లగ చూడగ పాడెద నేను కోరికోరి|| పల్లెసీమ||హరిలో రంగ|| Follow My Blog for more and more Devotional And Traditional Song Lyrics.

Seemantham Song Lyrics | Baby Shower Songs | Telugu Traditional Song

Image
 Seemantham Song Lyrics in Telugu – This page provides the complete lyrics of a traditional Seemantham song, commonly sung during the Telugu Seemantham ceremony (Baby Shower).                                                                   Watch on YouTube Telugu Lyrics: సీతాదేవీ సీమంతానికి అందరు రారమ్మా  అక్షింతలు వేసి ఆశీర్వదించగా రారండోయమ్మ సీతాదేవీ సీమంతానికి అందరు రారమ్మా   అక్షింతలు వేసి దీవెనలీయగా రారండోయమ్మ కుంకుమ దిద్దండి..గంధము పూయండి  అత్తరుజల్లి చేతికి నిండుగ గాజులు వేయండీ ||సీతాదేవీ|| - పువ్వులు పెట్టండి .. కాళ్ళకి పసుపుని రాయండి పళ్ళు పలహారాలు సలివిడి ఒడిలో నింపండి ||సీతాదేవి|| హారతి పట్టండి... అక్షింతలేయండి పండంటి బిడ్డని త్వరలో ఇమ్మని జీవెనలియ్యండీ ||సీతాదేవి|| Follow My Blog for more Devotional and Traditional Songs and Lyrics.

శ్రీ వాసవీ కన్యకాపరమేశ్వరి చాలీసా | Sri Vasavi Chalisa Lyrics in Telugu

Image
 భక్తి శ్రద్ధలతో శ్రీ వాసవీ మాత అనుగ్రహం కోసం "శ్రీ వాసవీ చాలీసా" పఠించండి. పూర్తి తెలుగు సాహిత్యం ఇక్కడ ఉంది. (Chant the Sri Vasavi Chalisa with devotion for Vasavi Mata's blessings. The complete Telugu lyrics are here.) Watch On Youtube Telugu Lyrics: వాసవి మాత సత్యప్రియ  జగతికిమూలం నీవమ్మ  కన్యకదేవి అవతారం  జగమంతటికి ఆధారం మల్లెపూవులు తెచ్చితిమి  మనసును నీకెఇచ్చితిమి వాసవులంత చేరితిమి నీ పారాయణము చేసితిమి పద్మరేకుల కాంతులతో పసిడి మెరుపుల మెరియంగా హంసవాహిని రూపిణిగా  వెలసితివమ్మ కన్నెమ్మ తెల్లని వస్త్రం దరియించి మల్లెమాలను వేసుకుని భక్తి మార్గము చూపితివి జ్ఞాన జ్యోతిని నింపితివి పెనుగొండాపురి వాసవిగా కన్యకదేవి రూపముగా వెలసితివమ్మ నీవమ్మ దర్ఱన మీయగ రావమ్మ వాసవి మాతా దర్ఱనము  సిరి సంపదలకు ఆహ్వానం కలియుగమందున నీరూపం కల్మషనాషిని నీవమ్మ కుసుమరాజునకు పుత్రికగా కుసుమాంబా కూతురిగా జనయించితివి లోకాన జనులందరికి దేవతగా అందం చందం నీవమ్మ గుడికే అందం నీవమ్మ దర్శన మీయగ రావమ్మ కష్టాలను కడ తేరషచమ్మ తెల్లని వస్త్రము ధరియించి శాంతికిరూపం చప్పావు చల్లగ దీవెన ఇచ్చావు సంత...

సంక్రాంతి పండుగ బొమ్మల కొలువు పాట | Bommala Koluvu Lyrics Telugu

Image
 సంక్రాంతి ప్రత్యేక బొమ్మల కొలువు పాట యొక్క పూర్తి తెలుగు లిరిక్స్. తెలుగు సంప్రదాయాన్ని ప్రతిబింబించే పండుగ పాట.                                                                 Watch on YouTube Telugu Lyrics: రండమ్మా రా రండమ్మా బొమ్మల కొలువు పేరంటానికి రండమ్మా రా రండమ్మా పసుపు కుంకుమల ఫలాలనంది పాపల దీవింప రారమ్మ  మా పాపల దీవింప రారమ్మ చరణం : వెన్న తినే చిన్ని కృష్ణుడు వేణువులూదే లీల కృష్ణుడు మత్స్య కల్క్యాది అవతారాలు అర్ధనారిశ్వర రూపాలు చరణం : లక్ష్మీ పార్వతి సరస్వతి ప్రతి రూపాల ప్రతిమలు భువిలో (సంక్రాంతి /దసరా ) వేడుక చూడగ దివికేగి దివి నుండి భువికేగి ఉన్నారు దివి నుంచి భువికేగినారి చరణం : పురి విప్పిన నెమళ్ళు మెరిసే కళ్ళ లేళ్ళు ఠీవిగ నిలిచిన సింహాలు భీతిని గోలిపే పులులు  సజీవతకు ఇవి సాక్ష్యాలు చెబితేనే అవి బొమ్మలు Please follow my Blog for more Devotional and Traditional Songs Lyrics

భోగి పండ్ల హారతి పాట లిరిక్స్ | Bhogi Pandlu Harathi Lyrics Telugu | Sankranthi Special

Image
 భోగి పండ్ల హారతి పాట యొక్క పూర్తి తెలుగు లిరిక్స్. సంక్రాంతి పండుగ సందర్భంగా పిల్లలకు పాడే సంప్రదాయ పాట.                                                              Watch on YouTube Telugu Lyrics: భోగి పండుగ వచ్చెను భోగి పండ్లు పోద్దాము  చిట్టిపొట్టి చిన్నారులకు హారతులిద్దాము ||భోగి|| ముద్దుగారే పిల్లలకు పట్టుబట్టలు కట్టరే  పీటమీద కూర్చోబెట్టి భోగిపండ్లు పోయరే ||ముద్దుగారే|| రేగిపళ్ళు శనగలు బెల్లము నాణెములతో  బంగారు పిల్లలకు భోగిపండ్లు పోద్దాము|| రేగి పళ్ళు||  ||భోగి పండుగ|| తలపైన భోగిపండ్లు జలజలమని పోద్దాము  చల్లగా ఉండమని ఆశీర్వాదము చేద్దాము||తలపైన|| మన మోహన ముద్దురూపం ముచ్చటైన పిల్లలకు మణిహారతులిద్దాము చిన్నారి దేవతలకు||మన|| భోగి పండుగ వచ్చెను భోగి పండ్లు పోద్దాము  చిట్టిపొట్టి చిన్నారులకు హారతులిద్దాము ||భోగి|| భోగిపండ్లు పోద్దాము హారతులిద్దాము  భోగిపండ్లు పోద్దాము Please do Follow My Blog ...

Ayyappa Swamy Bhajana | Ayyappa Song Lyrics | irumudi | Devotional Songs

Image
 శ్రీ అయ్యప్ప స్వామి భజన – తెలుగు లిరిక్స్‌తో కూడిన భక్తి పాట. అయ్యప్ప స్వామి ఆశీస్సులు పొందండి. Watch on YouTube Telugu Lyrics: శరణం శరణం అయ్యప్ప స్వామియే శరణం అయ్యప్ప శబరి గిరీశా అయ్యప్ప స్వామియే శరణం అయ్యప్ప  ||శరణం|| 1.సత్యం జ్యోతి వెలుగునయ్యా నిత్యం దానిని చూడుమయ్యా  పరుగున మీరు రారయ్యా శబరి గిరికి పోవుదము  ||శరణం|| 2.హరిహర మానస సుతుడైన సురుల మొరలను ఆలించి ధరణిలో తాను జనియించి పడునాల్గేడులు వశియించి ||శరణం|| 3.ఘోరాడవిలో బాలునిగా సర్పము నీడన పవళించి వేటకు వచ్చిన రాజునకు పసిబాలునిగా కనుపింప||శరణం|| 4.మణికంఠ అను నామముతో పెంచిరి రాజులు మురిపెముగా స్వామి మహిమతో రాజునకు కలిగెను సుతుడు మరియొకడు ||శరణం|| 5.గురు వాసములో చదివింప గురుని కుమారుని దీవింప మాటలు రాని బాలునకు మాటలు వచ్చెను మహిమలతో ||శరణం|| 6.మాతాపితలను సేవించి మహిషిని తాను వధియించి శబరి గిరిపై వెలసెనుగా మనలను ధన్యుల చేయుటకు ||శరణం|| 7.అయ్యప్ప అను నామముతో శిలగా మారి తానున్న జ్యోతి స్వరూప మహిమలతో భక్తుల కోర్కెలు తీర్చునయా||శరణం||  8.మార్గశిరాన మొదలెట్టి మండల కాలము దీక్షలతో శరణను భక్తుల భజనలతో ఇరుముడి కట్టి ప...

Sri Krishna Lullaby Song | Traditional Telugu Devotional | Sri Krishna Lali Pata Lyrics

Image
 A soulful Sri Krishna lullaby that reflects devotion, peace, and Telugu spiritual tradition. Explore its meaning and cultural importance.                                                            Watch On YouTube Telugu Lyrics: లాలనుచు పాడరమ్మా ఈ బిడ్డ లక్ష్మి విలాసుడమ్మా శ్యామలా రూపుడమ్మా ఈ బిడ్డ లీలావతారుడమ్మా || లాలనుచు|| కరమున కంకణమ్ము ఈ బిడ్డ శిరమునా పింఛమమ్మా పురమున శ్రీవత్సము ఈ బిడ్డ హరియనుచు పాడరమ్మా  ||కరమున|| లాలనుచు|| పాదమున చక్రమమ్మా ఈ బిడ్డ వేదాంత వేద్యుడమ్మా వేణునాదంబుతోడ ఈ బిడ్డ వేదములుపాడునమ్మా  ||పాదమున|| లాలనుచు|| లీలా వినోదుడమ్మా ఈ బిడ్డ గోపాల బాలుడమ్మ  గోలోక వాసుడమ్మ ఈ బిడ్డ రాధికానాధుడమ్మ ||లీలా|| లాలనుచు పాడరమ్మా ఈ బిడ్డ లక్ష్మి విలాసుడమ్మా శ్యామలా రూపుడమ్మా ఈ బిడ్డ లీలావతారుడమ్మా || లాలనుచు॥ Please Follow my Blog for more Devotional and Traditional Songs and Lyrics..