Suryanarayana Chalisa Lyrics in Telugu & English | Surya Dev Powerful Prayer Benefits
Suryanarayana Chalisa is a powerful devotional hymn dedicated to Lord Surya (Sun God), the source of life and energy. Chanting or listening to Suryanarayana Chalisa daily is believed to bring good health, confidence, success, and positive energy.
✨ Benefits of Chanting Suryanarayana Chalisa
Improves health, vitality, and immunity
Helps in career growth and success
Reduces mental stress and negativity
Increases self-confidence and positivity
Best chanted during early morning (Sunrise)
Telugu Lyrics:
అదిగో అదిగో ఆదిత్యుడు ఆ అదితి కన్న ప్రియ సుతుడు
సప్తాశ్వముల శోభితుడు కన్నుల వెలిగే ఘనవిభుడు
నారాయణ సూర్యనారాయణ ఆదిత్య రూపా నారాయణ దినకర తేజ దివాకరా పరమ ప్రకాశ ప్రభాకరా
నారాయణ సూర్యనారాయణ ఆదిత్య రూపా నారాయణ
బ్రహ్మ తేజమున భాసించి సాకారమున చరింయించి ఏకగమనమున పయనించి ఏ కోన్ముముఖముగ సాగేను కాంతికి రూపంగా తెలిసి కోటి కిరణముల భాసించి కాలగమనుని కందాము కరములు జోడి ఉందాము
కాల చక్రమున కదలాడే కాశ్యపేయుని కనరండి కర్మసాక్షిగా కనిపించే కనుల మాటను కనరండి సూర్యదేవుని కథ తెలియండి ఆదిత్య దేవుని స్మరించండి కాస్యపేయునిగ కనిపించాడు అదితి సుతునిగా వెలిగాడు
||నారాయణ సూర్యనారాయణ||
సాకారమున చరియిస్తూ సర్వ జగతిని పాలిస్తూ
జగతిని జాగృతి చేసాడు చైతన్యం తానై శోభించాడు విశ్వతేజమై వెలిగాడు విష్ణు తత్వమును చాటాడు చైతన్యానికి సారధిగా సకల జగతిని చుట్టాడు
||నారాయణ సూర్యనారాయణ||
విశ్వ నేత్రముగ విరిసాడు ఓంకారమును నింపుకొని సాకారమును కూర్చుకొని సంఘమిత్రునిగ మెలిగాడు విష్ణు నామాన విరిసేవు విశ్వఖ్యాతిని బడసేవు
రుద్ర రూపమును దాల్చేవు భద్రమూర్తిగా మెలిగేవు
||నారాయణ సూర్యనారాయణ||
ఆకాశాన నీ పయనం నదీ గమనముల నిర్దేశం
నియమ పాలన నీ తత్వం అవనిజనులకు శుభశకునం ప్రకృతి చక్రం తిరుగాడ పుడమిని జలమును గ్రహియించి వర్షముగా మరి కురిపించి పంటకు ప్రాణం పోసావు
||నారాయణ సూర్యనారాయణ||
సూర్య మండలము వాసముగా సకల దేవతలు వసియించ అన్నప్రాణములు వికసించి అన్ని జీవుల మెరిసేను
కడలితో స్నేహం చేసావు కలువకు మిత్రుడవైనావు
కోటిప్రభల కనిపించావు కనువిప్పగ కాంతులు మెరిసావు
||నారాయణ సూర్యనారాయణ||
చైతన్యానికి స్ఫూర్తివి నీవు కాంతి మండలపు కీర్తిని నీవు వికాసానికి ఊపిరి నీవు ప్రకాశానికి ప్రాణం నీవు కాలచక్రము నేను కూడా ధర్మ చక్రముగ మెలిగితివి మూడుకాలముల ముచ్చటగా సంధ్యనుకూడి మెలిగితివి
||నారాయణ సూర్యనారాయణ||
నిన్ను చూడగా సంధ్యాకాంత వందనీయతను బడసింది సంధ్య తేజమున నిను కూడి మూడు సంధ్యలా విరిసింది అంతరిక్షమున ఆద్యుడవు గ్రహమండలమున రారాజువు పాడిపంటలకు నువుప్రాణం రేయిపగలుకు నువుమూలం
||నారాయణ సూర్యనారాయణ||
వెలుగు రూపము దాల్చినది విశ్వనేత్రమై వెలిగినది శివహరితేజము శోభించ సూర్య నామమున తెలిసినది చైత్రములోన దాతగ తెలిసి రక్త వర్ణమున శోభించి కాశీవాసము చేసావు లోలార్కుని తెలిసావు
||నారాయణ సూర్యనారాయణ||
వైశాఖమున ఆర్యముడై పీత వర్ణమున ప్రభవించి
మేరు శిఖరమున మెరిసేవు కమల వికాసము కూర్చేవు దేవతలందరు నిను వేడ శిలారూపము నువు దాల్చి మయునిచేతిలో శిల్పంగా అవతరించితివి అపురూపంగా
||నారాయణ సూర్యనారాయణ||
శిలా ఖండములు అస్త్రములై సురసైన్యమున శోభించి అసుర సైన్యమును హతమార్చి అమరావతిని చేకూర్చే జ్యేష్ఠములోన జన మిత్రునిగా చీకట్లను తొలగించావు అరుణ వర్ణమున వెలిగేవు అంతట మోదము కూర్చేవు
||నారాయణ సూర్యనారాయణ||
ఉపాసనయే ఉపాయంగా సాంబుడు నిన్ను సేవించ ఆరోగ్యము సమకూర్చావు శాపముక్తిని చేశావు
ఆరోగ్యం భాస్కరా ఆదిత్య అన్న నానుడికి శ్రీకారం ఆనాటి నుండియే సాకారం సర్వజనులకు శుభయోగం
||నారాయణ సూర్యనారాయణ||
ఆషాడంలో అరుణుడవు శ్యామ వర్ణపు వరుణుడవు కాశీలోన కొలువైనావు ద్రౌపదాత్యునిగ తెలిసేవు
ఆరూపమున నిను కొలువ ఆకలి భాధలు తీర్చేవు అమృతత్వము కురిపించి అండగ ఎన్నడు నిలిచేవు
||నారాయణ సూర్యనారాయణ||
శ్రావణ మందున ఇంద్రుడవై శ్వేత వర్ణమున వెలిగేవు మయూఖముల విరిసేవు సౌభాగ్యదాతగ తెలిసేవు అంశుమాలిగా నినుతెలియ అభయ ప్రదాతగ నువు
విరియ ఆదివ్యాధులను అణచేవు ఆరోగ్యం సర్వము ఒసగేవు ||నారాయణ సూర్యనారాయణ||
గోధుమ వర్ణములో నీవు గ్రహమండలమున వెలిగేవు భాద్రపదమున భాసించేవు వివస్వంతునిగ తెలిసేవు ఆశ్వీయుజమున అగుపించి త్వష్ట రూపుడై తెలిసేవు విచిత్ర వర్ణముల శోభించి తష్టాదిత్యునిగా వెలిగేవు
||నారాయణ సూర్యనారాయణ||
కార్తీకమున కనిపిస్తూ అరుణ వర్ణమున అమరేవు
విష్ణు నామమున వెలిగేవు విశ్వపాలన చేసేవు మార్గశిరమున అంశుమంతుడై ఆకురంగున అమరేవు అనూరుడు రథసారథిగా మనోరధములను తీర్చేవు
||నారాయణ సూర్యనారాయణ||
పుష్య మాసమున ప్రభవించి భగనామమున భాసించి రక్తవర్ణమున రాజిల్లి విమలాదిత్యునిగ వెలిగేవు సోమునివోలె చల్లదనముతో శివునివోలె శుభమును కూర్చి
దివ్య శోభతో దర్శనమిచ్చి దుఃఖములను తొలగించేవు
||నారాయణ సూర్యనారాయణ||
మాఘ మాసమున మెరిసేవు పూషాదిత్యునిగ తెలిసేవు లక్కవర్ణమున వెలిగేవు శోకతాపములు తీర్చేవు
పాల్గుణమందు ప్రభవించి పర్జన్యునిగా పేరొంది అరుణతేజమున వెలిగేవు దుర్గతులను దూరంచేసేవు
||నారాయణ సూర్యనారాయణ||
మాసానికి ఒక నామంతో మోదము కూర్చెడిరూపంతో సకల వర్ణముల శోభించి ద్వాదశాదిత్యునిగ తెలిసేవు పూర్వ దిక్కును చూపించి దశదిశలా వెలిగిచ్చేవు పడమటింటికి పయనించేవు పరమపదమును సూచించేవు ||నారాయణ సూర్యనారాయణ||
Follow my Blog for more Devotinal And Traditional Song Lyrics.

Comments
Post a Comment