Posts

Showing posts with the label Devotional Song Lyrics

Sri Krishna Lullaby Song | Traditional Telugu Devotional | Sri Krishna Lali Pata Lyrics

Image
 A soulful Sri Krishna lullaby that reflects devotion, peace, and Telugu spiritual tradition. Explore its meaning and cultural importance.                                                            Watch On YouTube Telugu Lyrics: లాలనుచు పాడరమ్మా ఈ బిడ్డ లక్ష్మి విలాసుడమ్మా శ్యామలా రూపుడమ్మా ఈ బిడ్డ లీలావతారుడమ్మా || లాలనుచు|| కరమున కంకణమ్ము ఈ బిడ్డ శిరమునా పింఛమమ్మా పురమున శ్రీవత్సము ఈ బిడ్డ హరియనుచు పాడరమ్మా  ||కరమున|| లాలనుచు|| పాదమున చక్రమమ్మా ఈ బిడ్డ వేదాంత వేద్యుడమ్మా వేణునాదంబుతోడ ఈ బిడ్డ వేదములుపాడునమ్మా  ||పాదమున|| లాలనుచు|| లీలా వినోదుడమ్మా ఈ బిడ్డ గోపాల బాలుడమ్మ  గోలోక వాసుడమ్మ ఈ బిడ్డ రాధికానాధుడమ్మ ||లీలా|| లాలనుచు పాడరమ్మా ఈ బిడ్డ లక్ష్మి విలాసుడమ్మా శ్యామలా రూపుడమ్మా ఈ బిడ్డ లీలావతారుడమ్మా || లాలనుచు॥ Please Follow my Blog for more Devotional and Traditional Songs and Lyrics..

Tiruppavai Pasuram 1 in Telugu | Goda Devi Andal | Margazhi Special

Image
 Tiruppavai Pasurams written by Goda Devi (Andal) and translated into Telugu by Dr. Sri Vaddepalli Krishna Garu.  Traditionally recited during Dhanur Masam (Margazhi), this pasuram reflects deep devotion to Lord Perumal and the spirit of bhakti. Watch on YouTube Telugu Lyrics: మార్గశిర మాసాన  మంచి వెన్నెలలోన తానమాడ పోదాము తరలి రండి చెలులారా నీలమేఘ శ్యాముడైన  నిఖిలలోక దైవమైన శ్రీహరియే యశోద  శిశువై జన్మించెనంట నారాయణుడే ఇచ్చట నవనీతచోరుడంట ఆ వెన్నుని సన్నిథికై  పావన వ్రతమును సేయ కలువపూల కన్నులతో కలలుగాంచు కన్నెలారా ముత్యాల నవ్వు లొలికే మురళిలోలుని వేడగా Disclaimer: Lyrics are shared for devotional and educational purposes only. Full credit goes to the original author, translator, composer, and content creators.

Shiva Keshava Bhajana Lyrics | Telugu Devotional Song | Lord Shiva & Vishnu

Image
 “Shiva Keshava Bhajana” is a powerful Telugu devotional song praising Lord Shiva and Lord Vishnu (Keshava). Here you can find the complete lyrics, written in clear Telugu script, suitable for singing in pooja, daily prayers, and bhajan sessions. This bhajan brings peace, devotion, and spiritual energy.                                                                   Watch on YouTube Telugu Lyrics: ఓం ఓం ఓం ఓం ఓం అనరా  ఓంకారమ్మే ప్రణవమురా 11211 ప్రణవ నాదమే బ్రహ్మమురా  బ్రహ్మానందమే పొందుమురా రాం రాం రాం రాం రాం అనరా  రామనామమే రక్షణరా  రక్షణయే నీ మోక్షమ్మవురా  మోక్షప్రాప్తిమే పొందుము రా శివ శివ శివ శివ శివ యనరా  శివ కేశవులే ఒకటనరా  శివ పరమేశుని కొలువుమురా  కొలిచిన వారే ధన్యులు రా  శ్యాం శ్యాం శ్యాం శ్యాం శ్యాం అనరా  శ్యామ సుందరుడె కృష్ణుడురా  కృష్ణ ధ్యానమే చేయుమురా...

Om Hara Shankara Lyrics | Lord Shiva Song Telugu | Devotional Song Lyrics

Image
 Om Haraa Shankaraa Lyrics –  పవిత్రమైన Shiva devotional song కోసం పూర్తి Telugu lyrics ఇక్కడ అందుబాటులో ఉన్నాయి.                                                             Watch On YouTube Telugu Lyrics: ఓం హరా శంకర - హర హర ఓం హరా  శంకర  వందనం దిగంబరా వందితా పురంధరా  ఇందు ధర ధురంధరా - హిమచలాగ్ర మందిరా  అంగజ మద సంహారా - ఆర్తిని బాపవదేరా  గంగాధర ముదమారా - గౌరీ వర రావేరా  లింగధృతరు రంగ- వృషతు రంగ మంగళాకరా  అంజలి దే గైకోరా - ఆశ్రిత జనమందారా  మంజుల భాష సుధేరా- మామక దోష వివారా  కుంజ భవనుతుంజ దైత్య - భంజనా హర హర్ష  కుండలి భూష మహేశా - కుంజర దనుజ వినాశా  చండిత హృదయ నివాసా - ఖండిత కాలుని పాశా  మండలంబులెల్ల నిండి యుండినా పరాత్పరా ||ఓం|| యీక్షితి లక్ష్మణరావు - యిల వేల్పుడవై నావు .  దాక్షిణ్యంబిడరావు - దాసుల మదిమున్నావు..  యీ క్షణంబే దీక్షన - అపేక్ష మోక్షమియ్యర...

Satyanarayana Swamy Harathi Song Lyrics | సత్యనారాయణ స్వామి హారతి పాట

Image
 Satyanarayana Swamy Harathi song lyrics in Telugu.  This Harathi is sung during Satyanarayana Swamy Vratham and Pooja.  Devotees chant this Aarti at the end of the Vratham to receive blessings, good health, prosperity, and peace. ✨ Listen, chant and share these sacred lyrics with devotion. 🙏 శ్రీ సత్యనారాయణ స్వామి శరణం                                                  Watch On YouTube Telugu Lyrics: అరటాకు చెరుకుటాకు మంచిది మామిడాకు  పచ్చని పందిరి వేయరే నారాయణస్వామికి  మంగళమని పాడరే శ్రీ నారాయణస్వామికి   పాలు తేనె నెయ్యి పంచదార పెరుగు కలిపి  అభిషేకము చేయరే శ్రీ నారాయణస్వామికి  మంగళమని పాడరే శ్రీ నారాయణస్వామికి  పసుపు కుంకుమ పూలు గంధము అక్షింతాలు  అర్చనలు చేయరే శ్రీ నారాయణస్వామికి   మంగళమని పాడరే శ్రీ నారాయణస్వామికి  సేరుంబావు గోధుమపిండి సేరుంబావు పంచదార కలిపి  నైవేద్యం  చేయరే శ్రీ నా...

🕉 కేదారేశ్వర గౌరీ నోము పాట లిరిక్స్ | Kedareshwara Nomu Song Lyrics |Deepavali Nomu Song

Image
  కేదారేశ్వర గౌరీ నోము శివపార్వతుల అనుగ్రహం కోసం, దంపతుల సౌఖ్యం, ఐశ్వర్యం మరియు శాంతి కోసం ఆచరించబడుతుంది.                                                           Click to listen song on YouTube Telugu Lyrics: హారతిద్దాము రారమ్మ కేదారి గౌరుకు హరతిద్దాము రారమ్మ  హారతిద్దాము రారే శ్రీగౌరీ శంకరులకు  దీపావళి నోముల పూజా కేదారీశ్వరునకు చేయగ (హారతి) 2) అలనాడు పార్వతి చేసే పతిలో సగ భాగం కోసం ²  ఇల నాడు పడతులు చేసిరి పసుపూ కుంకుమల కోసం. "హారతి" 2) పాలవెల్లిని కట్టి, పద్మాల ముగ్గులు వేసి 2  మర్రాకుల ఆసనమేసి, మహిమాన్విత గౌరిని నిలిపి హారతి 9) 'మల్లెలు మొల్లలు తెచ్చి, శ్రీగంధ చందన మేట్టి 2  తంగేడు తామర పూలు. తల్లి నీ పూజకు తెస్తి 4 ) పార్వతీ పరమేశుని తలచి, పట్టుదారం తెచ్చి 2. 21 వరసల పోసి, ముల్లేసి కంకణమేట్టి హారతి 5) కేదారి వ్రతమునకు తోరాలే దైవాలని  నియమంగా పూజలు సేతు నిష్టాతో నిన్నే గొలుతు 6) గుమ్మాడి కాకర కూరలు పళ్ళ...

Tulasamma song lyrics | ma inta velasina | Tulasi Mata song lyrics | Devotional Song | Tulasi Puja

Image
  Sing along with this Tulsi Mata devotional song 🙏 Calm your mind and invite positive energy into your home.                                                         Click this to listen on YouTub e Telugu Lyrics : శ్రీ మాత శ్రీ తులసి రామ తులసి!  జయములు మాకివ్వు కృష్ణ తులసి// గోప ప్రదక్షిణము నీకిస్తినమ్మా గోవిందు సన్నిధి నాకీయవమ్మా" ఒంటి ప్రదక్షిణము నీకిస్తినమ్మా!  వైకుంఠ సన్నిధి నాకీయవమ్మా  రెండో ప్రదక్షిణము నీకిస్తినమ్మా !  నిండైన సంపదలుక నాకీయవమ్మా మూడో ప్రదక్షిణము నీకిస్తినమ్మా!  ముత్తయిదువ తనము నాకీయవమ్మా !! నాలుగో ప్రదక్షిణము నీకిస్తినమ్మా!  నవధాన్య రాశులను నాకీయవమ్మా || ఐదో ప్రదక్షిణము నీకిస్తినమ్మా!  ఆయువైదోతనము నాకీయవమ్మా !! ఆరో ప్రదక్షిణము నీకిస్తినమ్మా!  అత్తగల పుత్రుణ్ణి నాకీయవమ్మా!! ఏడో పుదక్షిణము నీకిస్తినమ్మా!  వేణుని ఏకాంత సేవీయవమ్మా !! ఎనిమిదో ప్రదక్షిణము నీకిస్తినమ్మా!  యమునిచ...

Kalagantini Nenu Kalagantini | Ammavari Pata with lyrics | Devotional Songs | కలగంటిని నేను కలగంటిని

Image
Kalagantini Nenu Kalagantini is a soulful devotional song that celebrates divine energy and devotion. ఈ పాటలో భక్తి, శాంతి మరియు శక్తి భావాలన్నీ నింపబడ్డాయి. 🙏 Sing along or read the lyrics to feel the spiritual vibrations of this beautiful song. 🎶                                                 🎥 Watch / Listen on YouTube                                         Click here and experience the full devotional song Telugu Lyrics: కలగంటిని, నేను కలగంటిని, కలలోన తల్లిని కనుగొంటిని ఎంత బాగున్నదో నను కన్న తల్లి,  ఎన్నాళ్ళకెన్నాళ్ళకు అగుపించే మళ్లీ ||కలగంటిని॥ మెడలోన అందాల మందార మాల,  జడలోన మల్లెల కుసుమాల హేల  ఆ మేము లో వెలుగు కోటి దీపాలు,  ఆ తల్లి పాదాలు దివ్య కమలాలు ||కలగంటిని|| కంచి కామాక్షి యా కాకున్న నేమి,  కాశీ విశాలాక్షి కాకూడదేమి,  కరుణ...

Lord Shiva Harathi Song Lyrics | శివ మంగళహారతి పాట | Telugu Lyrics | English Lyrics

Image
ॐOm Namah Shivaya🙏 This beautiful Harathi song is dedicated to Lord Shiva , the symbol of peace and divine energy. Sing this prayer every morning to invite blessings, positivity, and strength into your life. 🙏 🎥 Watch on YouTube: Listen to this full Song on my YouTube Channel Telugu Lyrics : నీలకంఠ దేవరా మంగళమ్ము రా  గంగ నేల రార హరా జంగమేశ్వరా  లింగరూప దర్శనం మంగళదాయకం  పార్వతీశ దర్శనం పాపనాశనం గంగాధర దర్శనం నిత్యమంగళం  పంచాక్షర పారాయణ శివా మంగళం శివ పంచాక్షర పారాయణ శివా మంగళం  మహాదేవ దర్శనం మంగళప్రదం మహిమాన్విత భక్తినం భూత పంచకం  ఆత్మలింగ దర్శనం మోక్ష దాయకం నమక చమక పారాయణ శివా మంగళం  రుద్ర నమక చమక పారాయణ శివా మంగళం English Lyrics: Neelakantha Devara Mangalammu Ra   Ganga Nela Rara Hara Jangameshwara     Lingaroopa Darshanam Mangala Daayakam   Parvateesha Darshanam Paapanaashanam   Gangadhara Darshanam Nitya Mangalam   Panchaakshara Paaraayana Shiva Mangalam   Shiva Panchaakshara...

Narayana Stotram Lyrics | నారాయణ స్తోత్రం

Image
 Experience the divine vibrations of Narayana Stotram 🙏 A sacred chant dedicated to Lord Vishnu , the preserver of the universe. Listening and chanting this stotram brings peace, positivity, and spiritual strength to your mind and soul. 🌸 🎶   Watch and Listen to Narayana Stotram on YouTube here Telugu Lyrics నారాయణ నారాయణ జయ గోవింద హరే ॥
 నారాయణ నారాయణ జయ గోపాల హరే ॥ కరుణాపారావార వరుణాలయగంభీర  
ఘననీరదసంకాశ కృతకలికల్మషనాశన  
నారాయణ నారాయణ జయ గోవింద హరే... నారాయణ నారాయణ జయ గోపాల హరే యమునాతీరవిహార ధృతకౌస్తుభమణిహార 
 పీతాంబరపరిధాన సురకళ్యాణనిధాన  
నారాయణ నారాయణ జయ గోవింద హరే... నారాయణ నారాయణ జయ గోపాల హరే మంజులగుంజలభూష మాయామానుషవేష  
రాధాధరమధురసిక రజనీకరకులతిలక  
నారాయణ నారాయణ జయ గోవింద హరే... నారాయణ నారాయణ జయ గోపాల హరే మురళీగానవినోద వేదస్తుతభూపాద  
బర్హినిబర్హాపీడ నటనాటకఫణిక్రీడ  
నారాయణ నారాయణ జయ గోవింద హరే... నారాయణ నారాయణ జయ గోపాల హరే వారిజభూషాభరణ రాజివరుక్మిణీరమణ  జలరుహదళనిభనేత్ర జగదారంభకసూత్ర  నారాయణ నారాయణ జయ గోవింద హరే... నార...

Welcome to Kalaa Korner

Image
 Welcome to Kalaa Korner , a sacred space where devotion meets art. 🌸 Kalaa Korner brings you a collection of devotional songs lyrics in Telugu and English -  all shared with love and reverence. Let every word connect you to peace, positivity, and the divine presence within. 🙏 Join me in celebrating devotion through words, music, and the timeless beauty of bhakti . 🙏✨