Women's Day Song | అపరంజి బొమ్మేనుగా | Women Song
Watch On Youtube అపరంజి బొమ్మేనుగా ఆడది అందాల అలివేణిరా. అమరాగ వల్లేను రా ఆడది బంధాల సుమమేనురా అమ్మగా ఆలిగా చెల్లిగా బిడ్డగా మనతోనే తానున్నది ఆడది దేవతే తానయినది ... ఆడది ... దేవతే తానయినది. సుధలనే చల్లే సుమగంధమల్లె మమతనే పంచే మారాణితానే సమతనే చూపే ప్రతిబింబమల్లే వ్యధలనే బాపే సురగంగతానే చీకటిలో చిరునవ్వు చిరుదివ్వెలా తానుమారి చుక్కానిలా నీకు దిశని చూపించి కలనైన కష్టాన్ని నిను చేరనీదు. మనతోనే తానున్నది... ఆనది దేవతే తావయినది చదువుల్లో మేటిగా ఆటల్లో ధీటుగా మేధస్సులో తనకు తానే సాటిగా ఏ'రంగమయినా గెలుపు తనదేగా జగమంత తన ముందు దాసోమేగా గగన తలమును తాకు శక్తి తన సొంతం కదన రంగమునాడు యుక్తి తన పంతం సృష్టికే తాను ఆధారమయ్యింది. మనతోనే తానున్నది... ఆడది దేవతే తానయినది .. !! అపరంజి||