Posts

Showing posts with the label Traditional Songs

Lali Song | Telugu Lullaby | Sleep Song | Traditional Songs | Cradle Ceremony

Image
                                                            Watch on YouTube Telugu Lyrics: పగడాల ఉయ్యాలలో నా తండ్రి  పవళింపు సేవ నీకు  పంతాలు విడిచిపెట్టి బంగారు తండ్రి నీవు పవళించరా.... దేవకి సుతుడు అంట  నీతోటి ఆటలాడగ వచ్చును  పవళించి మేలుకొని ఆటలకు సిద్ధంగా నుండవయ్యా... ప్రహ్లాద బాలుడంట  నీతోడ పాట పాడగ వచ్చును  పవళించి మేలుకోనీ పాడుటకు సిద్ధంగ నుండవయ్యా..... శ్రీ బాల రాముడంట  నీ తోడ చిందులేయగవచ్చును  పవళించి మేలుకొని చిందేయ సిద్ధంగా నుండవయ్యా.... వామనా బాలుడంట  నీతోడ చదువుసాగించవచ్చు పవళించి మేలుకొని చదువులకు సిద్ధంగ నుండవయ్యా Follow My Blog for More Devotional and Traditional Songs

సంక్రాంతి పండుగ బొమ్మల కొలువు పాట | Bommala Koluvu Lyrics Telugu

Image
 సంక్రాంతి ప్రత్యేక బొమ్మల కొలువు పాట యొక్క పూర్తి తెలుగు లిరిక్స్. తెలుగు సంప్రదాయాన్ని ప్రతిబింబించే పండుగ పాట.                                                                 Watch on YouTube Telugu Lyrics: రండమ్మా రా రండమ్మా బొమ్మల కొలువు పేరంటానికి రండమ్మా రా రండమ్మా పసుపు కుంకుమల ఫలాలనంది పాపల దీవింప రారమ్మ  మా పాపల దీవింప రారమ్మ చరణం : వెన్న తినే చిన్ని కృష్ణుడు వేణువులూదే లీల కృష్ణుడు మత్స్య కల్క్యాది అవతారాలు అర్ధనారిశ్వర రూపాలు చరణం : లక్ష్మీ పార్వతి సరస్వతి ప్రతి రూపాల ప్రతిమలు భువిలో (సంక్రాంతి /దసరా ) వేడుక చూడగ దివికేగి దివి నుండి భువికేగి ఉన్నారు దివి నుంచి భువికేగినారి చరణం : పురి విప్పిన నెమళ్ళు మెరిసే కళ్ళ లేళ్ళు ఠీవిగ నిలిచిన సింహాలు భీతిని గోలిపే పులులు  సజీవతకు ఇవి సాక్ష్యాలు చెబితేనే అవి బొమ్మలు Please follow my Blog for more Devotional and Traditional Songs Lyrics

భోగి పండ్ల హారతి పాట లిరిక్స్ | Bhogi Pandlu Harathi Lyrics Telugu | Sankranthi Special

Image
 భోగి పండ్ల హారతి పాట యొక్క పూర్తి తెలుగు లిరిక్స్. సంక్రాంతి పండుగ సందర్భంగా పిల్లలకు పాడే సంప్రదాయ పాట.                                                              Watch on YouTube Telugu Lyrics: భోగి పండుగ వచ్చెను భోగి పండ్లు పోద్దాము  చిట్టిపొట్టి చిన్నారులకు హారతులిద్దాము ||భోగి|| ముద్దుగారే పిల్లలకు పట్టుబట్టలు కట్టరే  పీటమీద కూర్చోబెట్టి భోగిపండ్లు పోయరే ||ముద్దుగారే|| రేగిపళ్ళు శనగలు బెల్లము నాణెములతో  బంగారు పిల్లలకు భోగిపండ్లు పోద్దాము|| రేగి పళ్ళు||  ||భోగి పండుగ|| తలపైన భోగిపండ్లు జలజలమని పోద్దాము  చల్లగా ఉండమని ఆశీర్వాదము చేద్దాము||తలపైన|| మన మోహన ముద్దురూపం ముచ్చటైన పిల్లలకు మణిహారతులిద్దాము చిన్నారి దేవతలకు||మన|| భోగి పండుగ వచ్చెను భోగి పండ్లు పోద్దాము  చిట్టిపొట్టి చిన్నారులకు హారతులిద్దాము ||భోగి|| భోగిపండ్లు పోద్దాము హారతులిద్దాము  భోగిపండ్లు పోద్దాము Please do Follow My Blog ...

💍 Pelli Appagintalu Song Lyrics in Telugu – తులసీదాస్ గారు రచన | Traditional Telugu Wedding Song

Image
 తులసీదాస్ గారు రచించిన ఈ “పెళ్లి అప్పగింతలు” పాట తెలుగు పెళ్లిళ్లలో అత్యంత పవిత్రమైన సాంప్రదాయ గీతాలలో ఒకటి. ఈ పాటలో తల్లిదండ్రులు కుమార్తెను అల్లుడికి అప్పగించే భావోద్వేగ క్షణాన్ని సుందరమైన పదాలతో చిత్రించారు. ఇది కుటుంబ బంధం, ప్రేమ, ఆశీర్వాదం, భక్తి అన్నింటినీ కలిపిన గీతం. 💐 Listen on YouTube Telugu Lyrics: ప) కోటి శుభములు కలుగునీకు పోయి రావమ్మా ముక్కోటి వేల్పుల దీవెనలతో వెలయు మాయమ్మా ॥కోటి॥ చ) కీర్తికాంతుల భాగ్యరాశుల శోభనీదమ్మా  పుట్టినింటికి - మెట్టినింటికి పేరు తేవమ్మా చ) అత్తమామలే - తల్లిదండ్రులు- ఈక్షణము నుండి  ఉత్తమ ఇల్లాలిగానువు - మసలుకోవమ్మా చ) మగని మనసు - నెరిగి నీవు, నడచుకోవమ్మా  ప్రేమమీరగ - భర్త సేవలు చేసుకోవమ్మా చ) మరదిబావల ఆడపడుచుల-కలసిమెసలమ్మా  బంధుమిత్రులు - సేవకులను ఆదరించమ్మా చ) ఆటపాటలు - అన్నివేళల పనికిరావమ్మా  ఆటు పోటుల - మాటపడగ అలుక తగదమ్మా చ) పిల్లపాపలు-కలిగి నీవు చల్లగుండమ్మా  ఎల్ల వేళల భక్తిమార్గము ననుసరించమ్మా చ) అల్లుడా- మాముద్దుపట్టిని అప్పగించేము  మనసుదీరగ - మురిపెమారగ - ఏలుకోవయ్యా చ) కల్లకపటములేని పిల్లను మీకు ఇచ్చే...

Saree Function Song Lyrics | Telugu Traditional Songs

Image
This beautiful Telugu Saree Function Song is sung during traditional family celebrations and saree ceremonies. The song expresses happiness, love, and blessings as women gather to celebrate the auspicious saree function with joy and devotion. 🌸 Enjoy this cultural melody that reflects the grace of Telugu traditions and the festive spirit of family togetherness. 💫                                                                 Listen Song on Youtube Telugu Lyrics: పదునాలుగు లోకాలు పదిలంగ పాలించే పద్మాక్షి వరముతో జన్మించినావు చిరకాలము నీవు సిరి సంపదల తోటి శ్రీ మహాలక్ష్మిగా వర్ధిల్లనమ్మా శ్రీదేవి భూదేవి అలివేణి అజురాణి అమ్మ లలితా మాత పాలించు తల్లి అన్ని విద్యలకెల్ల ఆది విద్యల తల్లి శ్రీ వాణి గానవు వెలుగొందలమ్మ కంచి కామాక్షిగా మధుర మీనాక్షిగా  శ్రీ కనక దుర్గగా వెలుగొంద వమ్మా  జగమంత పాలించే శ్రీ మాత రూపాన  శ్రీ గౌరి ...

Traditional Marriage Songs lyrics | Pelli patalu | Pellikoduku Songs | telugu wedding songs

Image
 Experience the beauty of Telugu traditions 💫 ✨ Celebrate the essence of Telugu culture and music that connects hearts through traditions and soulful tunes. పెళ్లి లో సరదాగా పాడుకునే పాట Click to Listen this song on Youtube Telugu Lyrics: ఒక్క వెయ్యి ఇస్తాము పోకవక్క ఇస్తాము రావయ్య పెళ్ళికొడుక నాగవల్లికి  ఒక వెయ్యి అక్కర్లేదు పోక వక్క అక్కర్లేదు రామండి మామగారు నాగవల్లికి రెండు వేలు ఇస్తాము రొట్టె ముక్క ఇస్తాము. రావయ్య పెళ్ళికొడుక నాగవల్లికి  రెండువేలు అక్కర్లేదు రొట్టె ముక్క అక్కర్లేదు రామండి మామగారు నాగవల్లికి మూడు వేలు ఇస్తాము ముచ్చట పిల్లని ఇస్తాము. రావయ్య పెళ్ళికొడుక నాగవల్లికి మూడు వేలు అక్కర్లేదు ముచ్చట పిల్ల అక్కర్లేదు. రామండి మామగారు నాగవల్లికి నాలుగు వేలు ఇస్తాము నల్ల పిల్లనిస్తాము రావయ్య పెళ్ళికొడుక నాగవల్లికి నాలుగు వేలు అక్కర్లేదు నల్ల పిల్ల అక్కర్లేదు రామండి మామగారు నాగవల్లికి ఐదు వేలు ఇస్తాము అరిచే పిల్లనిస్తాము రావయ్య పెళ్ళికొడుక నాగవల్లికి  ఐదు వేలు అక్కరలేదు అరిచే పిల్ల అక్కర్లేదు. రామండి మామగారు నాగవల్లికి ఆరు వేలు ఇస్తాము అరటి గెల ఇస్తాము రావయ్య పె...