Ayyappa Swamy Bhajana | Ayyappa Song Lyrics | irumudi | Devotional Songs
శ్రీ అయ్యప్ప స్వామి భజన – తెలుగు లిరిక్స్‌తో కూడిన భక్తి పాట. అయ్యప్ప స్వామి ఆశీస్సులు పొందండి.
Telugu Lyrics:
శరణం శరణం అయ్యప్ప స్వామియే శరణం అయ్యప్ప శబరి గిరీశా అయ్యప్ప స్వామియే శరణం అయ్యప్ప
||శరణం||
1.సత్యం జ్యోతి వెలుగునయ్యా నిత్యం దానిని చూడుమయ్యా
పరుగున మీరు రారయ్యా శబరి గిరికి పోవుదము
||శరణం||
2.హరిహర మానస సుతుడైన సురుల మొరలను ఆలించి ధరణిలో తాను జనియించి పడునాల్గేడులు వశియించి ||శరణం||
3.ఘోరాడవిలో బాలునిగా సర్పము నీడన పవళించి వేటకు వచ్చిన రాజునకు పసిబాలునిగా కనుపింప||శరణం||
4.మణికంఠ అను నామముతో పెంచిరి రాజులు మురిపెముగా స్వామి మహిమతో రాజునకు కలిగెను సుతుడు మరియొకడు ||శరణం||
5.గురు వాసములో చదివింప గురుని కుమారుని దీవింప మాటలు రాని బాలునకు మాటలు వచ్చెను మహిమలతో ||శరణం||
6.మాతాపితలను సేవించి మహిషిని తాను వధియించి శబరి గిరిపై వెలసెనుగా మనలను ధన్యుల చేయుటకు ||శరణం||
7.అయ్యప్ప అను నామముతో శిలగా మారి తానున్న జ్యోతి స్వరూప మహిమలతో భక్తుల కోర్కెలు తీర్చునయా||శరణం||
8.మార్గశిరాన మొదలెట్టి మండల కాలము దీక్షలతో శరణను భక్తుల భజనలతో ఇరుముడి కట్టి పయనించు
||శరణం||
9.భోగికి ముందు చేరాలి స్వామిని కనుల చూడాలి
చాలు చాలు మనకింక వలదు వలదు ఇక జన్మ ||శరణం||
10.మకర సంక్రాంతి దినమున సాయంకాలం సమయములో కాంతమలయ్యను గిరిపైన జ్యోతిగ తాను కనిపింప||శరణం||
11.పాలాభిషేకం స్వామికే నెయ్యాభిషేకం స్వామికే తేనాభిషేకం స్వామికే పూలాభిషేకం స్వామికే||శరణం||
12.కర్పూర హారతి తనకెంతో పానకమంటే మరి ఎంతో శరణను పదము ఎంతెంతో ఇష్టం ఇష్టం స్వామికే
||శరణం||
13 హరిహరాసనం స్వామిది సుందర రూపం స్వామిది కన్నుల పండగ మనదేలే జన్మ తరించుట మనకేలే
||శరణం||
Please Do follow My Blog for more Devotional and Traditional Song Lyrics

Comments
Post a Comment