భోగి పండ్ల హారతి పాట లిరిక్స్ | Bhogi Pandlu Harathi Lyrics Telugu | Sankranthi Special
భోగి పండ్ల హారతి పాట యొక్క పూర్తి తెలుగు లిరిక్స్. సంక్రాంతి పండుగ సందర్భంగా పిల్లలకు పాడే సంప్రదాయ పాట.
Telugu Lyrics:
భోగి పండుగ వచ్చెను భోగి పండ్లు పోద్దాము
చిట్టిపొట్టి చిన్నారులకు హారతులిద్దాము ||భోగి||
ముద్దుగారే పిల్లలకు పట్టుబట్టలు కట్టరే
పీటమీద కూర్చోబెట్టి భోగిపండ్లు పోయరే ||ముద్దుగారే||
రేగిపళ్ళు శనగలు బెల్లము నాణెములతో
బంగారు పిల్లలకు భోగిపండ్లు పోద్దాము|| రేగి పళ్ళు||
||భోగి పండుగ||
తలపైన భోగిపండ్లు జలజలమని పోద్దాము
చల్లగా ఉండమని ఆశీర్వాదము చేద్దాము||తలపైన||
మన మోహన ముద్దురూపం ముచ్చటైన పిల్లలకు మణిహారతులిద్దాము చిన్నారి దేవతలకు||మన||
భోగి పండుగ వచ్చెను భోగి పండ్లు పోద్దాము
చిట్టిపొట్టి చిన్నారులకు హారతులిద్దాము ||భోగి||
భోగిపండ్లు పోద్దాము హారతులిద్దాము
భోగిపండ్లు పోద్దాము
Please do Follow My Blog for more Devotional and Traditional Song Lyrics

Comments
Post a Comment