Amma Nee Padamu Song Lyrics | Devotional Songs | Ammavri Patalu

 Experience the divine bliss with this soulful Ammavari devotional song, describing the supreme importance and grace of the Goddess's lotus feet (అమ్మవారి పాదాలు). This song brings peace and spiritual energy to your soul.


Watch on YouTube

Telugu Lyrics:

అమ్మా నీ పాదము ఆనంద నిలయము 

అది తెలిసిన వారిచే జన్మ ధన్యము || అమ్మా !!


బ్రహ్మాదులు పూజించిన బ్రహ్మణ నీ పాదము 

రమావాణి సేవించిన రమ్యమైన పాదము. 

కైలాస గిరియందు కదలాడే పాదము 

అలమేరు నిలయాన్ని అలరించే పాదము ||అమ్మా||


వేదన పొందిన జీవుల దరిచేర్చే పాదము 

చీకటి బ్రతుకున వెలుగులు విరజిమ్మే పాదము 

భవ బంధములను బాపే బంగారు పాదము. 

అనురాగ పాశముతో బంధించే పాదము ||అమ్మా||


వేదశాస్త్ర పురాణాలు వివరించే పాదము 

శివ తాండవ జతిగతులను నర్తించే పాదము. యోగింద్రుల జపతపముల ధ్యానమే నీ పాదము. 

భక్త జనుల అర్చనలతో శోభిల్లే పాదము ||అమ్మా||


లోభిని త్యాగిని చేసే లోకమాత పాదము 

మూఢుని జ్ఞానిగ మార్చే ముచ్చటైన పాదము 

అజ్ఞాన తిమిరమును తొలగించే పాదము 

సుజ్ఞాన దీపమును వెలిగించే పాదము || అమ్మా||


కోటిజన్మ పుణ్యఫలము కోమలి నీ పాదము

అల్పతపస్సులకు అది అందరాని పాదము 

వశిన్యాది దేవతలు వర్ణించిన పాదము 

హయగ్రీవ భగవానులు అర్చించిన పాదము ||అమ్మా||


నా జీవన గమ్యము నా భాగ్యము నీ పాదము 

నా గానము నా ప్రాణము సర్వము నీ పాదము 

చివరకు నే చేరేది శ్రీ మాత పాదము 

శరణన్న వారికీ శరణమే నీ పాదము ||అమ్మా||

Follow my Blog for more Devotional and Traditional Songs and Lyrics

Comments

Popular posts from this blog

Traditional Marriage Songs lyrics | Pelli patalu | Pellikoduku Songs | telugu wedding songs

Vasavi Mata Parayanam Lyrics | Kanyaka Parameswari Parayanam | Devotional Songs Telugu

Neerajanam Song Lyrics | Neerajanam Miku Neerajanam | Mangala Harathi Song | Devotional Song