💍 Pelli Appagintalu Song Lyrics in Telugu – తులసీదాస్ గారు రచన | Traditional Telugu Wedding Song

 తులసీదాస్ గారు రచించిన ఈ “పెళ్లి అప్పగింతలు” పాట తెలుగు పెళ్లిళ్లలో అత్యంత పవిత్రమైన సాంప్రదాయ గీతాలలో ఒకటి.

ఈ పాటలో తల్లిదండ్రులు కుమార్తెను అల్లుడికి అప్పగించే భావోద్వేగ క్షణాన్ని సుందరమైన పదాలతో చిత్రించారు.

ఇది కుటుంబ బంధం, ప్రేమ, ఆశీర్వాదం, భక్తి అన్నింటినీ కలిపిన గీతం. 💐





Telugu Lyrics:

ప) కోటి శుభములు కలుగునీకు పోయి రావమ్మా ముక్కోటి వేల్పుల దీవెనలతో వెలయు మాయమ్మా

॥కోటి॥

చ) కీర్తికాంతుల భాగ్యరాశుల శోభనీదమ్మా 
పుట్టినింటికి - మెట్టినింటికి పేరు తేవమ్మా

చ) అత్తమామలే - తల్లిదండ్రులు- ఈక్షణము నుండి 
ఉత్తమ ఇల్లాలిగానువు - మసలుకోవమ్మా

చ) మగని మనసు - నెరిగి నీవు, నడచుకోవమ్మా
 ప్రేమమీరగ - భర్త సేవలు చేసుకోవమ్మా

చ) మరదిబావల ఆడపడుచుల-కలసిమెసలమ్మా 
బంధుమిత్రులు - సేవకులను ఆదరించమ్మా

చ) ఆటపాటలు - అన్నివేళల పనికిరావమ్మా 
ఆటు పోటుల - మాటపడగ అలుక తగదమ్మా

చ) పిల్లపాపలు-కలిగి నీవు చల్లగుండమ్మా 
ఎల్ల వేళల భక్తిమార్గము ననుసరించమ్మా

చ) అల్లుడా- మాముద్దుపట్టిని అప్పగించేము 
మనసుదీరగ - మురిపెమారగ - ఏలుకోవయ్యా

చ) కల్లకపటములేని పిల్లను మీకు ఇచ్చేము
 కంటిపాపగ వెంటనుండి చూసుకోవదిన

చ) పదిలమమ్మా కన్నతల్లి పోయిరావమ్మా 
పదమువ్రాసిన- తులసిదాసుని మాటవినవమ్మా



English Lyrics:

Pa) Koti shubhamulu kaluguneeku Poyi raavamma
 mukkoti velpula deevenalatho velayu maayamma ॥Koti॥

Cha) Keerthi kaanthula bhaagya raashula shobhaneedamma
Puttinintiki - mettinintiki peru thevamma

Cha) Attamaamale - thallidandrulu - eekshanamu nundi
Uttama illaaligaanuvu - masalukovamma

Cha) Magani manasu - nerigi neevu nadachukovamma
Premameeraga - bhartha sevalu chesukovamma

Cha) Maradhibaavala aadapaduchula - kalasimesalamma
Bandhumitrulu - sevakulanu aadarinchamma

Cha) Aatapaatalu - anni velala panikiravamma
Aatu potula - maatapadaga aluka thagadamma

Cha) Pillapaapalu - kaligi neevu challagundamma
Ella velala bhakti maargamunu anusarinchamma

Cha) Alludaa - maamuddu pattini appaginchemu
Manasu deeraga - muripemaaraga - eelukovayya

Cha) Kallakapata muleni pillanu meeku icchemu
Kantipaapaga ventanundi choosukovadina

Cha) Padilamamma kannathalli poyi raavamma
Padamuvrasina - Tulasidaasuni maatavinavamma

Follow @kalaakornerofficial for more Devotional and traditional Songs

Comments

Popular posts from this blog

Traditional Marriage Songs lyrics | Pelli patalu | Pellikoduku Songs | telugu wedding songs

Vasavi Mata Parayanam Lyrics | Kanyaka Parameswari Parayanam | Devotional Songs Telugu

Neerajanam Song Lyrics | Neerajanam Miku Neerajanam | Mangala Harathi Song | Devotional Song