Traditional Marriage Songs lyrics | Pelli patalu | Pellikoduku Songs | telugu wedding songs
Experience the beauty of Telugu traditions 💫
✨ Celebrate the essence of Telugu culture and music that connects hearts through traditions and soulful tunes.
పెళ్లి లో సరదాగా పాడుకునే పాట
Telugu Lyrics:
ఒక్క వెయ్యి ఇస్తాము పోకవక్క ఇస్తాము రావయ్య పెళ్ళికొడుక నాగవల్లికి
ఒక వెయ్యి అక్కర్లేదు పోక వక్క అక్కర్లేదు రామండి మామగారు నాగవల్లికి
రెండు వేలు ఇస్తాము రొట్టె ముక్క ఇస్తాము. రావయ్య పెళ్ళికొడుక నాగవల్లికి
రెండువేలు అక్కర్లేదు రొట్టె ముక్క అక్కర్లేదు రామండి మామగారు నాగవల్లికి
మూడు వేలు ఇస్తాము ముచ్చట పిల్లని ఇస్తాము. రావయ్య పెళ్ళికొడుక నాగవల్లికి
మూడు వేలు అక్కర్లేదు ముచ్చట పిల్ల అక్కర్లేదు. రామండి మామగారు నాగవల్లికి
నాలుగు వేలు ఇస్తాము నల్ల పిల్లనిస్తాము రావయ్య పెళ్ళికొడుక నాగవల్లికి
నాలుగు వేలు అక్కర్లేదు నల్ల పిల్ల అక్కర్లేదు రామండి మామగారు నాగవల్లికి
ఐదు వేలు ఇస్తాము అరిచే పిల్లనిస్తాము రావయ్య పెళ్ళికొడుక నాగవల్లికి
ఐదు వేలు అక్కరలేదు అరిచే పిల్ల అక్కర్లేదు. రామండి మామగారు నాగవల్లికి
ఆరు వేలు ఇస్తాము అరటి గెల ఇస్తాము రావయ్య పెళ్ళికొడుక నాగవల్లికి
ఆరు వేలు అక్కర్లేదు అరటి గెల అక్కర్లేదు రామండి మామగారు నాగవల్లికి
ఏడు వేలు ఇస్తాము ఏడ్చే పిల్లనిస్తాము రావయ్య పెళ్ళికొడుక నాగవల్లికి
ఏడు వేలు అక్కర్లేదు ఏడ్చే పిల్ల అక్కర్లేదు రామండి మామగారు నాగవల్లికి
ఎనిమిది వేలు ఇస్తాము ఎర్ర పిల్లనిస్తాము రావయ్య పెళ్ళికొడుకు నాగవల్లికి
ఎనిమిది వేలు అక్కర్లేదు ఎర్ర పిల్ల అక్కర్లేదు రామండి మామగారు నాగవల్లికి
తొమ్మిది వేలు ఇస్తాము తొక్కుడు సైకిలిస్తాము రావయ్య పెళ్ళికొడుకు నాగవల్లికి
తొమ్మిది వేలు అక్కర్లేదు తొక్కుడు సైకిల్ అక్కర్లేదు. రామండి మామగారు నాగవల్లికి
పది వేలు ఇస్తాము పందిరి మంచం ఇస్తాము రావయ్య పెళ్ళికొడుక నాగవల్లికి
పది వేలు అక్కర్లేదు పందిరి మంచం అక్కర్లేదు రామండి మామగారు నాగవల్లికి
లక్ష రూపాయలిస్తాం లక్ష్మీకాంత నిస్తాము రావయ్య పెళ్ళికొడుక నాగవెల్లికి
లక్ష రూపాయ లక్కర్లేదు లక్ష్మీకాంత అక్కర్లేదు రామండి మామగారు నాగవెల్లికి
కోటి రూపాయలిస్తాము కనకదుర్గనిస్తాము రావయ్య పెళ్ళికొడుక నాగవల్లికి
కోటి రూపాయలు కావాలి బెజవాడ కనకదుర్గ కావాలి వస్తామండి మామగారు నాగవల్లికి

Comments
Post a Comment