Gomata Song | Gou Matha | Bhakti Song
Telugu Lyrics:
దండాలు దండాలు దండాలోయమ్మా గోమాతా మా అండ దండ నీవేనమ్మ గోమాత దండాలు దండాలు దండాలోయమ్మ గోమాత మా అండ దండ నీవేనమ్మ గోమాత మా అండ దండ నీవేనమ్మ గోమాత//దండాలు//
కుడితె తాగినట్టి మేలుకే-
మా కడప నిండా పాలు పోసినావు పిడికెడంత గడ్డి పరకకే- నీవు గడపగడప పాడి నింపినావు ఇంధనాల పొందు లేకుండా- కాడెద్దులనే మాకిచ్చినావు ఎండకెండినావు వాన నాని నావ్ ఎకరాల కెకరాల మన్ను దున్నినావ్//దండాలు//
కొమ్ములందు వెంకటేశుడు నీ కన్నుల్లో కైలాస వాసుడు వెన్నుపూస బ్రహ్మదేవుడు నీ పొదుగులోన పరమాత్ముడు అష్టలక్ష్మిలు ముక్కోటి దేవుళ్ళు ఓయమ్మ నీలోనే ఉన్నారు నీ నాల్గు పాదాల ఈనేలనే నడిచి భువిని చక్కగేలుతున్నారు//దండాలు//
మన తల్లి పాలిస్తుంది మూడేళ్లు గోతల్లి పాలిచ్చేను నూరేళ్లు గోవు పాలు నుంచి పంచామృతం గోవు మయం మూత్రాదులే ఔషధం ఆ బాల గోపాలమంతా నీ పాల కేంద్రాల చెంత నీ పాలతో జనుల పాపాలు కడిగేసి దీపాలు వెలిగించి నామమ్మ//దండాలు//
గోవులు ఉంటేనే తిండి మనకి గోమాతే ఆధారమండి గోవును కాపాడరండి గోవు లేకుంటే సాగదీబండి అంతమవుతున్నాయి గోవులు మనమంతా రక్షించాలి రారండి
ఇంతమంది దేశ ప్రజలందరుండగా గోహత్యలు సిగ్గుచేటండి.//దండాలు//

Comments
Post a Comment