Vasavi Mata Parayanam Lyrics | Kanyaka Parameswari Parayanam | Devotional Songs Telugu
Sri Vasavi Mata Parayanam is a sacred devotional chant recited by devotees of Vasavi Kanyaka Parameswari Devi, the divine embodiment of peace and dharma.
Chanting these powerful verses is believed to bring prosperity, harmony, and spiritual strength.
Click here and listen on YouTube
వరుస : శ్రీరంగ రంగ రంగా మాయన్న కావేటి రంగ రంగా...
1. శ్రీ కన్యకా పరమేశ్వరి మాయమ్మ కాపాడుమమ్మ మమ్ము
పుణ్యచారిత్రి నిన్ను నిరతమును పూజింతు మమ్మ మేము
2. కృతయుగంబున రేణుకా ఈ తల్లి త్రేతమున జానకమ్మా
ద్వాపరంబున ద్రౌపదీ - కలియందు కన్యకాపరమేశ్వరి
||శ్రీ కన్యకా|
3. పెనుగొండ పట్నమందూ- వైశ్యులా వర్ణమున జన్మించిరి
కుసుమాంబ గర్భమందూ- ఇరువురూ కవలలుగ బుట్టిరమ్మా
॥శ్రీ కన్యకా॥
4. లాలియని బాడరమ్మా వీరలు దైవవర శిశువులమ్మ
అపరంజికారులమ్మా - ఈ బాలకుసుమశెట్టికి బిడ్డలు
||శ్రీ కన్యకా|
5. శశికాంతి మించెనమ్మా - వీరిపుడు శంకరుని బోలియుండే
పార్వతీ అంశంబుతో - వైశ్యులకు ఉదయించె వీరిరువురూ
||శ్రీ కన్యకా|
6. కరములా కంకణములూ ఈ బాలశిరమున చింతామణీ
యురములను శ్రీవత్సమూ ఈ బిడ్డ దేవులని దలచరమ్మా
||శ్రీ కన్యకా|
7. పాదముల పద్మమమ్మా హస్తముల చిలుక పుష్పంబులమ్మా
భుజమందు భుజకీర్తులూ- గాంచెనూ కుసుమ దంపతులిరువురూ॥
శ్రీ కన్యకా॥
8. తెలియపరచెను ప్రేమతో సంఘముకు ప్రజలకూ వెనువెంటనే
పుష్పములు జల్లిరమ్మా - హృదయమున కానందమాయనమ్మా ॥
శ్రీ కన్యకా॥
9. బాలబాలికకప్పుడూ వాసవీ విరూపాక్షనుబేర్లతో
నామకరణముజేశిరీ - బిడ్డలూ బెరుగుచుండిరి చక్కగా
శ్రీ కన్యకా|
10. ఆటపాటలు సాగెనూ - బిడ్డలకు ఐదేండ్లు వయసు నిండె
అక్షరాభ్యాసంబుకై - గురువైన బాస్కరుని రప్పించెనూ
||శ్రీ కన్యకా||
11. విజ్ఞాన ప్రజ్ఞంబుతో- ఇరువురికి కౌమార దశగల్గెనూ
సంగీత సాహిత్యమూ - విలువిద్య గొప్పగా నేర్చిరమ్మా
||శ్రీ కన్యకా||
12. అష్టాదశాస్త్రమ్ములూ నాలుగూ వేదములు నేర్చిరమ్మా
ఆశ్రమా విద్యనుండీ - వెంటనే గృహములకు వచ్చిరమ్మా
||శ్రీ కన్యకా||
13. బంధువుల బిలిచిరమ్మా వైశ్యులూ వేదములు బటియింపగా
తక్షణము తలిదండ్రులూ విరూపాక్ష కుపనయనముల్ చేసిరీ
||శ్రీ కన్యకా||
14. రత్నవతి రమణి తోడా విరూపాక్ష వైవాహికంబాయెనూ
కాపురంబునకొచ్చెనూ - కోడలూ కనికరంబుగనుండెనూ
||శ్రీ కన్యకా||
15. రాజమండ్రీ పురమునూ విష్ణువర్ధనుడు పాలనము జేయుచుండే
దిగ్విజయంబునకునై - పయనించి పెనుగొండ కొచ్చెనమ్మా
||శ్రీ కన్యకా॥
16. ఈ రాజు ఎవ్వరనినా పాండవుల మనుమడై జనియించెనూ
చంద్ర వంశపురాజుగా - ఈతనూ ప్రఖ్యాతిగాంచెనమ్మా
||శ్రీ కన్యకా|
17. పెనుగొండ పుర వైశ్యులూ రాజుకూ హారతులు ఇచ్చుటకునై
కన్యతోడుతనేగెను - కుసుమార్య వేడుకలు చేయిచుండే
||శ్రీ కన్యకా|
18. కన్యకను చూచి రాజూ - కనుచెదిరి కామాంధుడై బల్కెనూ
కన్యనాకిమ్మటంటూ - యారాజు రాయభారము బంపెనూ
||శ్రీ కన్యకా|
19. వైశ్య సంఘము బెద్దలూ - యోచించి బాలనగరుల బంపిరీ
యుక్తితో బాలురంతా - రాజుకూ బుద్ధులూ ఇటు జెప్పిరీ
||శ్రీ కన్యకా|
20. "ఓ మహారాజరాజా మా కన్యదైవంశమున బుట్టెనూ
మానవుడయ్య నీవూ - ఆ శక్తి గోరటం తగదు రాజా
||శ్రీ కన్యకా||
21. యాబదీమూడు మందీ "భార్యలూ నీఇంట యుండగానే
మా వైశ్యకుల కాంతనూ - కోరుటా ధర్మమూ కానేరదు"
||శ్రీ కన్యకా||
22. అని బాలురిట్లుబలుకా ఆ మాట పెడచెవినబెట్టి రాజూ
కన్నెర్ర జేశితానూ - బిడ్డలను కట్టి కొట్టింతుననెనూ
||శ్రీ కన్యకా||
23. "కత్తియుద్దము జేశెదా - మీరలూ కన్యనూ ఇవ్వమనినా
మూడు లోకములందునా ఇటువంటి సుందరీదొరకదనెనూ
||శ్రీ కన్యకా|
24. నిత్యకృత్యములందునా వాసవిని మరువలేకాపోయెనూ
కామాంధకారంబుతో - క్రోధముగ బాలురను జూచెనమ్మా
||శ్రీ కన్యకా|
25. భక్తితో బాలురంతా - వాసవిని మనసుతో తలచిరమ్మా
బాలురూ యుక్తితోడా - 'పెండ్లి'నీ చేతుమని చెప్పిరమ్మా
||శ్రీ కన్యకా||
26. "గురుశుక్రమౌఢ్యమయ్యా - ఇపుడెట్లు చేతుమాబెండ్లియనిరీ
మాఘమున తరలివచ్చి తక్షణము బెండ్లాడు మంచిదనిరీ
27. “పెండ్లి' యే ముఖ్యమైతే బహుళముగా మేమైనజేతుమయ్యా
లోకమున లేనిరీతి - 'పరలోక పెండ్లి' నీచేతుమనెనూ"
28. కామాంధకారంబుతో రాజుకూ ఏమియూ బోధపడకా
బాలురను మెచ్చుకొనెనూ మరియునూ వావివరసలు గలిపెనూ
॥శ్రీ కన్యకా|
29. “అటులైన మరుదులారా ఒకపూట ఆతిధ్యమునుచేతునూ
కాబోవు అల్లుండనే - వెంటనే వంటలను జేయుడనెనూ"
||శ్రీ కన్యకా||
30. రాజుమాటలు దెచ్చిరీ బాలురూ పెద్దలకు వివరించిరీ
యుక్తితో యోచించిరీ - వేరొకా వైశ్యబాలురబంపిరీ
31. యోగీశఋష్యాదులన్ - ఆతిధ్యమిచ్చితే పుణ్యమౌనూ
కామాంధ ద్రోహులకునూ పానీయమిచ్చినా పాపమౌనూ
32. అష్టదశపురాణాలూ - బాలురకు హృదయమున స్ఫురియించెనూ
భాగవత గ్రంధమందూ - యుండినా పద్యంబు జ్ఞప్తికొచ్చే
||శ్రీ కన్యకా|
33. 'వారజాక్షులయందునా - మరియునూ వైవాహ, విత్తమందూ
ప్రాణమానమునందునా - బొంకొచ్చు పాపమే అంటదయ్యా
||శ్రీ కన్యకా|
34. విశధముగ యోచించిరీ బాలురూ బొంకు నిర్ధారణచేశిరీ
విష్ణువర్ధన రాజుతో - బాలురూ జెప్పనారంభించిరీ
||శ్రీ కన్యకా॥
35. “ఓ మహారాజు బావా - మా వైశ్య ధర్మంబు దెలియలేదే?
'గతికితే అతుకదయ్యా' - అందు నీకేది గావలొచెప్పుమా”
||శ్రీ కన్యకా॥
36. “చాల బెండ్లిండ్లాయెనూ - ఏమామ నాకిట్లు చెప్పలేదే?
ఇదియెట్టి ధర్మమేమో? - విపులముగ జెప్పుమూ మరదులారా”
||శ్రీ కన్యకా||
37. “పెండ్లిగావలెనన్నచో - ముందుగా అన్నమును గతకరాదూ
అన్నమే ముఖ్యమైతే - కన్నకను ఇప్పుడే మరచవయ్యా”
||శ్రీ కన్యకా||
38. “అటులైన వైశ్యులారా - అన్నమూ నాకొద్దు నిజము నిజమూ
కన్యయే నాకు ముఖ్యం - అందుకై మాఘమున వచ్చెదనెనూ
||శ్రీ కన్యకా||
39. వైశ్యబాలుర మాటలూ - సత్యమని రారాజు తలచెనమ్మా
తక్షణము సైన్యంబుతో - రాజు తన స్వస్థానమునకేగెనూ
||శ్రీ కన్యకా||
40. వైశ్యులందరు గూడిరీ - ఇపుడెట్లు చేతుమా ? యోచించిరీ
యువజనా సంఘమంతా - యుద్ధమూ జేయుటే తధ్యమనిరీ
||శ్రీ కన్యకా|
41.(వెంటనే వాసవాంబా - చక్కనీ ఉపమాన మిటుజెప్పెనూ
"కైలాసయమలోకమూ - వెళ్లుటకు రెండుదారులు ఉండెనూ
||శ్రీ కన్యకా|
42. యుద్ధమే తధ్యమైతే - దుష్టునీ చేతిలో మరణించినా
మోక్షమునుచెందమపుడూ - మనకునూ యమలోకమేతథ్యమూ॥శ్రీ కన్యకా॥
43. దుర్మార్గుడైయుండినా - సైంధవుడు అభిమన్యు జంపెనయ్యా
సన్మార్గుడై యున్ననూ - అభిమన్యు యమపురికి జేరెనయ్యా
||శ్రీ కన్యకా||
44. హీరణ్యకశిపరాజూ - పలుమార్లు శ్రీహరిని దూషించినా
హరిచేత జచ్చెనయ్యా - మోక్షమును వెంటనే బొందెతానూ
||శ్రీ కన్యకా||
45. శాశ్వతము ఏది కాదూ - మనమునూ శీలమును రక్షించుకై
ప్రాణత్యాగముజేశితే - యుండునూ కీర్తి ఆచంద్రార్కమూ
||శ్రీ కన్యకా॥
46. కుసుమశ్రేష్ఠియు వెంటనే - అందరకు తెలియపరచుట కొరకునై
చాటింపు వేయించెనూ - వెనువెంట వచ్చెనూ వైశ్యులంతా
47. అంతటను ఆర్యవైశ్యా - సభలనూ మిన్నగా గావించిరీ
వాసవాంబతో సైతమూ - అగ్నిలో త్యాగమే మంచిదనెను
||శ్రీ కన్యకా||
48. వాసవీదేవియపుడూ - వృద్ధులను మాత్రమే దూకుమనెనూ
వైశ్యకులమును బాలూరూ - అభివృద్ధి చేయుటకు యుండ మనెను
||శ్రీ కన్యకా॥
49. అందులకు యారునూర్లా - పది రెండు గోత్రజూలు ఒప్పరైరీ
అగ్నిగుండములందునా - దూకమని వెడలిపోయిరి వారలూ
||శ్రీ కన్యకా|
50.బేరీలు బెదిరిపోయే - వళియాలు వంగిపోయిరి సాంతమూ
'పత్తి-దూది' యనుచునూ - వారలూ అష్టదిక్కులకెళ్లిరీ
||శ్రీ కన్యకా||
51. వారికీ వైశ్యులకునూ - సంబంధ బంధమే లేకుండెనూ
పెనుగొండ వదిలివెళ్లే - వారలూ అష్టకష్టములతోడనూ
||శ్రీ కన్యకా||
52. దు:ఖపూర్ణితముతోడా - యుండినా జనని జనకులగాంచియూ
చిరుమందహాసంబుతో - వాసవీ వేదాంతమిటు జెప్పెనూ
||శ్రీ కన్యకా||
53. గత జన్న ఎవరు మనమూ? - మరుజన్మ ఏమిటో? జెప్పగలమా
విధివ్రాత దాటతరమా? - మనకేమి వ్రాశెనో ఆ బ్రహ్మమూ?"
||శ్రీ కన్యకా||
54. శతత్రయ గుండంబులూ శూద్రులతో నేర్పుగా ద్రవ్వించెనూ
కృషియునూ గోరక్ష్యమూ - వారలకు ఇచ్చెనూ కుసుమశ్రేష్ఠి
||శ్రీ కన్యకా||
55. సన్నాయి మేళంబుతో- వైశ్యులూ పురవీధులన్ని దిరిగీ
ఋగ్వేద పఠనంబుతో - జేరిరీ నగరేశు నిలయమునకూ
||శ్రీ కన్యకా||
56. బాలురను పిలిచెనమ్మా వాసవీ వారితో ఇటుజెప్పెనూ
"గుండమున దూకగానే వెలశెదనుపూజలూ చేయుడనెనూ
||శ్రీ కన్యకా||
57. ఓ! తల్లిదండ్రులారా - నాకిపుడు పరిక్వ దశగల్గెనూ
స్వస్వరూపము జూపెదా - నన్నిపుడు కనులార గాంచరయ్యా"
"శ్రీ కన్యకా॥
58. వెంటనే వాసవాంబా భక్తులను బ్రేమతో దిలకించెనూ
వేయి సూర్యుల కాంతితో వెలిగెనూ ఆ దివ్య దేవతపుడూ
||శ్రీ కన్యకా||
59. భూమి యాకాశంబులా- వాసవీ దిక్కులలో నిండెనమ్మా
దిశలు దప్పెను వెంటనే - గ్రహములూ తేజమును జూడలేకా
||శ్రీ కన్యకా||
60. ప్రకృతీ యావత్తునూ వాసవీ నామముతో నిండెనమ్మా
సర్వజగములు గాంచెనూ - వైశ్యులూ దంపతీయుతముగానూ
||శ్రీ కన్యకా||
61. దశదిశలు నిండినట్టీ- ఆ దివ్య దర్శనము గన్పించెనూ
"జగము వణకుచునున్నదీ - జగజ్జనని కావవే భక్త (వైశ్య) కోటీ"
॥శ్రీ కన్యకా॥
62. పాటలూ పద్యంబులూ- దండకము భక్తితో జదివిరమ్మా
వాసవిని స్తుతియించుతూ భక్తులూ వందనము జేశిరమ్మా
||శ్రీ కన్యకా||
63. ధూపదీపముతోడనూ వైశ్యులూ పూజించి పొగిడిరమ్మా
శాంతించి వాసవాంబా - కన్యగా అందరకు గన్పించెనూ
||శ్రీ కన్యకా||
64. నవకన్యకలతోడనూ - వాసవికి అభిషేకములు జేశిరి
పుట్టుపుట్టము గట్టిరీ - భక్తితో పూలహారములేశిరి
||శ్రీ కన్యకా|
65. భాస్కరుని రప్పించిరీ- గుండములో అగ్నినీ దాల్పించిరి
భగ్గుభగ్గున జ్యాలలూ - గొప్పగా మిన్నంటెమిన్నగానూ
||శ్రీ కన్యకా||
66. అంతటా భాస్కరుడూ వాసవితో ఇట్లనీ బల్కెనమ్మా
"శుభ ఘడియ ఏతెంచెనూ - ముందుగా అగ్నిలో దూకమనెనూ"
॥శ్రీ కన్యకా॥
67.ఆ శుభా సమయంబులో- భాస్కరుడు మంత్రమును పఠియించెనూ
దేవతలు దీవించిరీ - వెంటనే పుష్వవర్షము గురిశెనూ
||శ్రీ కన్యకా||
5
68. గంధంబు జల్లిరమ్మా దంపతులు గాయత్రి గాంచిరమ్మా
బ్రాహ్మణులు దీవించిరీ- పురజనులు పుష్పములు జల్లిరమ్మా
||శ్రీ కన్యకా||
69. నా వైశ్యులందరకునూ- మోక్షమును ఇవ్వుమ"ని కోరినమ్మా
రాజునకు శాపమొసగీ- వాసవీ అగ్నిలో దూకెనమ్మా
||శ్రీ కన్యకా|
70. వెంటనే వాసవాంబా జ్యోతిగా కైలాసపురి జేరెనూ
శంకరుడు జూచెనమ్మా - అర్ధాంగి హస్తమును బట్టుకొనెను
||శ్రీ కన్యకా|
71. వామ అంకంబందునా వాసవిని కూర్చండ బెట్టుకొనెనూ
అర్ధశరీరంబందునా - జేర్చుకొని దర్శనము ఇచ్చెతాను
||శ్రీ కన్యకా||
72. నూటఇబ్బండ్రు గోత్రా దంపతులు అగ్నిలో భస్మమైరి
గురువైన భాస్కరుండూ - బాలురను దగ్గరకు జేర్చుకొనెనూ
||శ్రీ కన్యకా|
73. శైవ విమానములొచ్చెనూ శైవులకు స్వాగతము చెప్పెనమ్మా
శంకరుని కడకేగెను - వైశ్యులూ శూలపాణిని గాంచిరీ
||శ్రీ కన్యకా|
74. విష్ణుదూతలు వచ్చెనూ వైష్ణవులు విష్ణునే గాంచిరమ్మా
ఈ చరితమిట్లుండగా - రాజుకూ ఇక్కట్లు మెండాయెనూ
||శ్రీ కన్యకా॥
75 'పెండ్లి పెండ్లి' యనుచునూ రారాజు పెనుగొండ పురి జేరెను
వెంటనే శ్శాపంబుతో - ఇక్కడే తలపగిలి జచ్చెనమ్మా
||శ్రీ కన్యకా॥
76 విష్ణువర్ధన ప్రాణము - గంధర్బ లోకముకు జేరెనమ్మా
విష్ణువర్ధన పుత్రుడూ - మంచిగా మైత్రి భావము జూపెనూ
||శ్రీ కన్యకా||
77. అతి వైభవంబునిండే- విరూపాక్ష పట్టాభిషేకంబుతో
మంగళంబులు బాడిరీ- అందరూ సంతసము వెదజిల్లుచూ
||శ్రీ కన్యకా|
78. పార్వతీ అంశంబుతో- వెలశితివి కన్యకా పరమేశ్వరీ
ఆర్యవైశ్యులకెల్లనూ - ఇలవేల్పువైతివని బొగడినారూ
||శ్రీ కన్యకా||
79. వైశాఖ శుద్ధ దశమీ - వాసవికి మాఘ శుద్ధా విదియకూ
పూజలను జేయవలెను - వెంటనే వాంఛలూ నెరవేరునూ
||శ్రీ కన్యకా||
80.ఈ కథను ఇంటింటనూ చదివినా చెప్పినా విన్నగానీ
పరమ మోక్షముతోడనూ - నిక్కముగా సకల సౌఖ్యము కల్గునూ ॥
శ్రీ కన్యకా॥
81. భక్తితో ప్రతినిత్యమూ వాసవికి పూజలు చేయుడమ్మా
మంగళము బాడరమ్మా మంగళము పాడితే మోక్షమమ్మా
||శ్రీ కన్యకా||
Please follow me for more Devotional Songs Lyrics

Comments
Post a Comment