Mangalam Jaya Mangalam | Sri Krishna Harathi Song Lyrics | Devotional Aarti of Lord Krishna | Telugu Songs
Experience divine bliss with these sacred Sri Krishna Harathi song lyrics. This devotional aarti is sung to praise Lord Krishna and seek His blessings, peace, and grace in daily life.
Telugu Lyrics:
మంగళం జయ మంగళం..
మా నల్లనయ్యకు మంగళం.. ||2||
మంగళం జయ మంగళం ..
మా కృష్ణ స్వామికి మంగళం.. ||2|| ||మంగళం||
శిరమునందున మెరయుచుండెడి
నెమలి పింఛకు మంగళం.. ||2||
శ్యామలాంగుని కరములందలి
మధురమురళికి మంగళం..||2|| ||
మంగళం||
వనజగమ్మును ధిక్కరించెడి
వదనశోభకు మంగళం...||2||
కరుణరసమును చిందుచుండెడి
కన్నుదోయికి మంగళం..||2|| ||
మంగళం||
బ్రహ్మచే పూజింపబడిన
చరణయుగళికి మంగళం..||2||
జగములన్నియు కన్నతండ్రగు
చక్కనయ్యకు మంగళం.. ||2|| || మంగళం||
గోపికా గణసేవితుడు
శ్రీ గోవిందునకు మంగళం..
||2||
రాధికా పరివేష్టితుండౌ
రసేశ్వరునకు మంగళం... ||2|| ||మంగళం||
Follow My Blog for more and more Devotional and Traditional Song Lyrics

Comments
Post a Comment