Thiruppavai Song 5 | Song Lyrics | Margazhi | Dhanur Masam | Devotional
Tiruppavai Pasuram 5 written by Goda Devi (Andal) and translated into Telugu by Dr. Sri Vaddepalli Krishna Garu. Traditionally recited during Dhanur Masam (Margazhi), this pasuram reflects deep devotion to Lord Perumal and the spirit of bhakti.
Telugu Lyrics:
మాయలన్ని మాధవుని
మహిమాన్విత లీలలే
యమునా విహారమంతా
యదునందను క్రీడలే
గోపాలునిగా చరించి
ఘోరరాక్షసులనణచి
ధన్య యశోదామాతను
దామోదరుడే బ్రోచెను
విమల మనసుతో విష్ణుని
కమలాలతొ పూజించగ
నోరారా కీర్తించగ
ఉారంతా కదలిరారె
జన్మాంతర జటిల
పాపకర్మాలనూ కాల్చివేయూ
దివ్య దేవుడైన హరిని
దీక్షగా కొలువగరారే
Disclaimer: Lyrics are shared for devotional and educational purposes only. Full credit goes to the original author, translator, composer, and content creators.

Comments
Post a Comment