Thiruppavai Pasuram 12 | Goda Devi Song | Margazhi | Devotional Song Lyrics
Tiruppavai Pasurams are written by Goda Devi (Andal) and are translated into Telugu by Dr. Sri Vaddepalli Krishna Garu. Traditionally recited during Dhanur Masam (Margazhi), this pasuram reflects deep devotion to Lord Perumal and the spirit of bhakti.
Telugu Lyrics:
కన్నలేగదూడల తలచి
కలతజెందు గేదెలకు
పొదుగులన్ని చేపగాను
పొంగి పాలు కారె , రారే !
ముంగిలంత చిత్తడి ఆయే
ముద్దరాల లేచిరావే !
మంచు జల్లులో తడుస్తూ
పొంచి వాకిటనున్నామే !
రాక్షసుడగు రావణున్నే
శిక్షించిన శ్రీరామున్నే
గొప్పగాను కీర్తించగా
గోపెమ్మ రావమ్మా !
బద్దకమే వదలినీవు
నిద్దురనిక వీడవమ్మా !
వనితలతో గూడియింక
వ్రతముసేయ రావమ్మా !
Disclaimer: Lyrics are shared for devotional and educational purposes only. Full credit goes to the original author, translator, composer, and content creators.

Comments
Post a Comment