Mala Guchene Perumal Ni Nachene Lyrics – Goda Devi (Andal) Song | Dhanur Masam Special
Mala Guchene, Perumal Ni Nachene is a devotional song dedicated to Goda Devi (Andal) and Lord Perumal, traditionally sung during the sacred month of Dhanur Masam (Margazhi). The song reflects pure devotion, love, and surrender, and is believed to bring peace and divine blessings to devotees.
Telugu Lyrics:
మాల గుచ్చెనె పెరుమాళ్ ని నచ్చెనే
మాల గుచ్చెనే పెరుమాళ్ ని నచ్చెనే
మాల గుచ్చి తాను నచ్చి మనసు ఇచ్చెనే
మాల మార్చెనే పెరుమాళ్లే మెచ్చెనె
పూల కూర్చి తాను మెచ్చి మనసు గెల్చెనే
గోదయే రాధయి మాధవుణ్ణి చేరెనే
మాల మార్చెనే పెరుమాళ్లే మెచ్చెనే
తులసి వనమట నీ జన్మ స్థలమటా
ఆ సీత లాగె నీవు అయోనిజవటా
రంగవిభుడట శృంగార సఖుడట
శేషశాయివై శ్రీరంగమందే వెలసెగా
ఆడిపాడు చూడికుడుత కోరి నిన్ను వలచెగా
మాల మార్చెనే పెరుమాళ్లే మెచ్చెనే
తిరుప్పావట తియ్యనైన పదమట
తిరుప్పావట తియ్యనైన పదమట
పదము పదము దండగుచ్చి కృష్ణగళము చేర్చెగా
మూడుపదులట అవి పాశురములట
మార్గళి వ్రతము అను మార్గమెుకటి చూపెగ
ఆండాళ్లు నిన్ను చేరి ఆళ్వారై విరిసెగ
మాల మార్చెనే పెరుమాళ్లే మెచ్చెనే
మాల మార్చేనే పెరుమాళ్లే మెచ్చెనే
మాల గుచ్చేనె పెరుమాళ్ ని నచ్చెనే
మాలే గుచ్చేనె పెరుమాళ్ ని నచ్చెనే
మాల మార్చేనే పెరుమాళ్లే మెచ్చెనే
మాల మార్చేనే పెరుమాళ్లే మెచ్చెనే
మాల గుచ్చేనె పెరుమాళ్ ని నచ్చెనే
మాల మార్చేనే పెరుమాళ్లే మెచ్చెనే
Disclaimer: Lyrics are shared for devotional and educational purposes only. Full credit goes to the original composer and rights holders.

Comments
Post a Comment