Bhagavad Gita Song Lyrics | Gita Jayanthi Special | Devotional Song lyrics
A devotional Bhagavad Gita song to mark Gita Jayanthi. These lyrics celebrate the divine teachings of Lord Krishna and the timeless wisdom of the Gita.
శ్రీమద్భగవద్గీత మాత నీకు వందనం.
జగద్గురువు శ్రీకృష్ణ పరమాత్మకు వందనం.
ద్వాపర యుగమందున మార్గశిర మాసమున
శుద్ద ఏకాదశిన పుట్టిన గీతా మాత
వేదముల సారమంత వడపోసిన గ్రంథము
పంచమ వేదముగా వెలసినది గ్రంథము
పరమాత్ముదని ముఖము నుండి వెలువడిన గ్రంథము
ప్రతి మనిషి జీవనాన్ని తీర్చిదిద్దు గ్రంధము.
ఏ యుగము వారినైన ఉద్దరించునీ గీత
శ్రీ కృష్ణుడు ప్రేమతో అందించినదీ గీత
వ్యాపభగవానుడు వర్ణించినదీ గీత
ఋషులు మునులు ప్రచారము చేసినదీ ఈ గీత
జ్ఞాన కర్మ భక్తి నొసగు త్రివేణీ సంగమము
ధర్మార్ధా మోక్షములను ఒసగేను అనుదినము
హరిషడ్వర్గాల ననచి శక్తినిచ్చు సంయమము
వేదములను సముద్రమున వెలసిన గీతామృతము
కావలసినదందించే గీత కల్పవృక్షము
భక్తి పుష్ప సుగంధము ప్రసరించే దామము
తల్లి వలే కాపాడి మనకొసగును మోక్షము
అందరి చెంతగనిలిచే అద్భుత అమృత భాండము
భగవన్ముఖారవింద సంజణిత జ్ఞాన గంగ
సర్వ నదుల సమమైన తీర్థమయి పుణ్యగంగా
సర్వధర్మముల సారము తెలిపినది ధర్మగంగ
సర్వదేవతల విశ్వరూపము చూపినా గీతగంగ
భగవంతుడు ప్రతి ఒక్కరి దగ్గరుండు వీలు కాక
ప్రతి గృహమందున వెలసెను శ్రీమద్భగవద్గీత
తన రూపమే గీత అని గీతనే తాను అని
నీలో నేనున్నానని ఆశ్వాసన మిచ్చెను
గీత గంగా గాయత్రి సీత సత్య సరస్పతి
బ్రహ్మ విద్య బ్రహ్మవల్లి త్రిసంధ్య ముక్తిగేహిని
అర్థమాత్ర చిదానంద భవగ్ని భ్రాంతినాశిని
వేదత్రయి పర అనంత తత్వర్ధఙ్ఞానమంజరి
అష్టాదశ నామాలతో విలసిల్లెను ఈ గీత
కోటి కోటి వందనములు తల్లీ గీతా మాత
Please do Follow for more Devotional Songs, Traditional Songs and their Lyrics.

Comments
Post a Comment