🌺 దేవికిదే పూజ పాట లిరిక్స్ | Devikide Puja Song Lyrics in Telugu | Devotional
🙏 దేవికి పాద పూజ (Deviki Pada Puja) – A soulful Telugu devotional song dedicated to Amma Durga / Shakti Devi.
Telugu Lyrics:
దేవికిదే పూజ పాదపూజ
మంచి మనసుతో చేసే మల్లెల పూజ 🌼
కలకాలం దేవికి కనకాంబరమాల
చేయి వదల రాదని చేమంతుల మాల
మోహక్షయ కారిణకి మొగలి పూల మాల
దయతలిచే తల్లికి దవనపూ మాల 🌸
గుండెలోన దేవికి గులాబీల మాల
సర్వాంతర్యామికి సంపెంగల మాల
మమతల మాతల్లికి మందార మాల
ప్రేమైక మూర్తికి పొన్న పూల మాల 🌼
నాదస్వరూపిణికి నాగమల్లె మాల
మందస్మిత వదనకు మాలతీ మాల
తీయని పలుకుల తల్లికి తులసీదళ మాల
భక్త కల్పవల్లికి బంతి పూల మాల 🌺
చల్లని చూపుల తల్లికి చంపకపూ మాల
కరుణాలవాలకు కమలాల మాల
కలిదోషహారిణికి కలువపూల మాల
సుగుణాల రాశికి సన్నజాజి మాల 🌼
English Lyrics:
Devikide puja paadapuja
Manchi manasutho cheyse mallela puja 🌼
Kalakalaṁ Deviki kanakāmbaramāla
Cheyi vadala rādanī chēmantula māla
Mohakṣaya kāriṇiki mogali pūla māla
Dayataliche talliki davanapū māla 🌸
Gundelōna Deviki gulābīla māla
Sarvāntaryāmiki sampengala māla
Mamatala mātalliki mandāra māla
Premaika mūrtiki ponna pūla māla 🌼
Nādasvarūpiṇiki nāgamalle māla
Mandasmita vadanaku mālatī māla
Tīyani palukula talliki tulasīdala māla
Bhakta kalpavalliki banti pūla māla 🌺
Challani chupula talliki champakapū māla
Karunālavālaku kamalāla māla
Kalidōṣahāriṇiki kaluvapūla māla
Suguṇāla rāśiki sannajāji māla 🌼
🕉 భక్తి భావంతో దేవికీ తల్లిని పూజిద్దాం. ఆమె పాదపద్మాల వద్ద సమర్పించిన ప్రతి పువ్వు మన జీవితానికి శుభం, శాంతి, ప్రేమ నింపుతుంది. 🙏
Follow me for more Songs and Lyrics.

Comments
Post a Comment