Bommala Koluvu Harati Song Lyrics in Telugu | బొమ్మల కొలువు హారతి పాట | దేవుళ్లు ఇంటికి విచ్చేసిన వేళ పాడుకునే హారతి

 బొమ్మల కొలువు హారతి పాట — దేవుళ్లు ఇంటికి విచ్చేసిన వేళ పాడుకునే అద్భుతమైన తెలుగు భక్తి హారతి 🪔

ఈ హారతి పాటను దసరా, దీపావళి, సంక్రాంతి వంటి పండుగల సందర్భంగా పాడతారు.

ఇది భక్తి, ఆనందం, ఐశ్వర్యం మరియు శాంతి తెచ్చే పవిత్రమైన హారతి ✨

In this post, you can find Bommala Koluvu Harati Song lyrics in Telugu, a devotional song that celebrates the arrival of deities into our home during the festive season 🌼



Telugu Lyrics:

బొమ్మాల కొలువును చూడంగ రారే 

బొమ్మాల హారతు లియ్యంగ రారే


నంది వాహనమెక్కి నాగభూషణుడే 

గంగా గౌరమ్మల తన వెంట కొనిరాగ 

మూషిక వాహనుడు ముందూగ ఇంట వచ్చె ||2||

||బొమ్మాల||


వెన్న ముద్దలు తిన్న వేణుగోపాలుడే 

గోవుల కాసిన గోపాల కృష్ణుడే 

గోపెమ్మలందరి తో మా యింట కొచ్చినారె.! ||2||  

 ||బొమ్మాల||


సీతమ్మ వెంటరాగ లక్ష్మయ్య తోడురాగ 

రామస్మరణతో మారుతి ముందురాగ 

శ్రీ రామచంద్రుడే మా యింట కొచ్చినాడె ||2|| 

||బొమ్మాల||


ఏడుకొండల వాడు కొలువాయ నా వంక 

లక్ష్మినరసింహుని నెలవదిగొ ఈ వంక 

ముక్కోటి దేవతలు మా యింట వెలసినారె ||2||

||బొమ్మాల||


💖 Follow & Support:

🌸 Listen with devotion and share the divine energy!

✨ Subscribe on YouTube: https://www.youtube.com/@KalaaKornerofficial

✨ Follow on Instagram: https://www.instagram.com/kalaakornerofficial?igsh=MTg0eTFqc2tpaWJ0ZA%3D%3D&utm_source=qr

Comments

Popular posts from this blog

Traditional Marriage Songs lyrics | Pelli patalu | Pellikoduku Songs | telugu wedding songs

Vasavi Mata Parayanam Lyrics | Kanyaka Parameswari Parayanam | Devotional Songs Telugu

Neerajanam Song Lyrics | Neerajanam Miku Neerajanam | Mangala Harathi Song | Devotional Song